చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా రాములు

బాధ్యతల స్వీకరణ

మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూర్ చేనేత సహకార సంఘానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్నికైన వంగరి రాములు శుక్రవారం స్థానిక చేనేత సహకార సంఘం భవనంలో యాదాద్రి భువనగిరి జిల్లా హ్యాండ్లూమ్ డైరెక్టర్ శ్రీనివాసరావు సమక్షంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మహేశ్వరం మధుసూదన్,ఉపాధ్యక్షురాలు మంచే పద్మ, డైరెక్టర్లు ఏలూరి మత్స్యగిరి, పోచం కన్నయ్య, పెండెం రాజారం, జోగు మచ్చేందర్, జల్ది రవీందర్, ఎలగందుల సుజాత,చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు జల్ది రాములు, జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గంగుల రాములు,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుండు ప్రసాద్,స్పూర్తి చైర్మన్ మంచే గోవర్ధన్,మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు మహేశ్వరం వెంకటేశ్వర్లు,నల్ల యాదగిరి, పట్టణ కార్యదర్శి జిల్లా రవీందర్, జల్ది సోమయ్య,రేగోటి యాదగిరి రహీంఖాన్ పేట అధ్యక్ష కార్యవర్గం , చేనేత సహకార సంఘం మేనేజర్ వేముల నర్సయ్య, దోర్న గోపయ్య,రఘు తదితర చేనేత కార్మికులు పాల్గొన్నారు.