ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉపాధి కల్పన కోర్సుల అనుమతి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉపాధి కల్పన కోర్సుల అనుమతి

  • ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి సంతోష్ కుమార్

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్‌సీ డైరీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బి.ఎస్‌సీ పౌల్ట్రీ సైన్స్ వంటి నూతన ఉపాధి కల్పన కోర్సులకు అనుమతి లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. సంతోష్ కుమార్ తెలిపారు.

2026-27 విద్యా సంవత్సరానికి కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కళాశాలలో బి.ఎస్‌సీ (బీజడ్‌సీ), బి.ఎస్‌సీ (బీజడ్‌సీఎస్), ఎం.పీ.సీ, ఎం.పీ.సీఎస్, బి.ఏ, బి.కాం (జనరల్) మరియు కంప్యూటర్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఉపాధి ఆధారిత కోర్సులు బి.ఎస్‌సీ డైరీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బి.ఎస్‌సీ పౌల్ట్రీ సైన్స్‌కు అనుమతి లభించడం విశేషమన్నారు. ఈ కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులు దోస్త్ ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని అడ్మిషన్ పొందవచ్చని సూచించారు.

అలాగే కళాశాలకు నూతన భవనం కూడా త్వరలోనే ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి రానుందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. సంతోష్ కుమార్ తెలిపారు.

Leave a Reply