ఎమ్మెల్యే సామెల్ చేతుల మీదుగా నియామకపు ఉత్తర్వులు
- మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలరాజు గౌడ్
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాచకొండ బాలరాజు గౌడ్‌ను నియమిస్తూ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బాలరాజు గౌడ్ సేవలను గుర్తించి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అనంతరం బాలరాజు గౌడ్‌కు శాలువా కప్పి సన్మానించారు.
నూతన మండల అధ్యక్షుడు రాచకొండ బాలరాజు గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, ఎమ్మెల్యే మందుల సామెల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే సామెల్ నివాసంలో మోత్కూర్ మున్సిపాలిటీ, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బాలరాజు గౌడ్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు, సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్‌లు బండ రమ విజయ్ రెడ్డి, బీసు వెంకన్న, నీలకంఠం, గుండు యాదగిరి, నాయకులు బుషిపాక నర్సింహా, పురుగుల నర్సింహా, పేలపూడి సత్యనారాయణ చౌదరి, గడ్డం లక్ష్మయ్య, ఎం.డి. జావేద్, గుండా రాములు, సోమలింగం తదితరులు పాల్గొన్నారు.
