పేదలకు అన్నదానం…

పేదలకు అన్నదానం…

పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్ లూనా సెంటర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎస్. సి విభాగం కార్యాలయం వద్ద విజనరి లీడర్ స్వర్ణాంధ్ర సృష్టి కర్త, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కూటమి శ్రేణులతో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేసి, అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ కుమార్ జైన్ సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాల్యాద్రి, పైడి శ్రీను, బెజ్జం జైపాల్,వేల్పుల రాజేష్, కొడాలి వంశీ, వినయ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply