రేపు ఇంట‌ర్, పీజీ విద్యాసంస్థల బంద్‌..

ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఆగస్టు 5న నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులకు, విద్యాసంస్థలకు ఏబీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద బంద్‌ వాల్‌పోస్టర్‌ను ఏబీవీపీ నాయకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న జీవో నం.77ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఏబీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.