జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్‌గా గంగేరి శ్రీహరి నియామకం

జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్‌గా గంగేరి శ్రీహరి నియామకం

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి పట్టణానికి చెందిన గంగేరి శ్రీహరి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన అఖిల భారత దళిత కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్ర పాల్ గౌతమ్, జాతీయ సలహాదారు కొప్పుల రాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ పాలనలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలు, దళితుల పక్షాన నిలుస్తుందని అన్నారు.