సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ

సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ

వాంకిడి, ఆంధ్రప్రభ:

కొమరం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని బంబార గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్సీ కాలనీ నుండి హైవే రోడ్డు వరకు నిర్మించనున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్నులే నారాయణ ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజి మాట్లాడుతూ, గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్, వార్డు సభ్యులు లోహబడే ఉమేష్, కోట్నాక రాంశవ్, భూరి శాలమ్మ, పొన్నాల వెంకటి, లోహబడే బాబురావు, లోహబడే తిరుపతి, మాండోకర్ మల్లయ్యతో పాటు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply