రైతులకు పంట మార్పిడి పై అవగాహన..

దండేపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫైసర్ డా:జె సాయి ప్రసాద్,డాక్టర్ పి శివకుమార్, ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు రసాయనిక ఎరువులు,పురుగు మందులు, అధికంగా వినియోగించడంతో భూసారం తగ్గిపోయి పంట దిగుబడి తగ్గిపోతుందని అన్నారు. రైతులు సమతుల్య పద్దతులను అనుసరించాలని సూచించారు. రైతులు కేవలం వరి పంటనే కాకుండా ఇతర పంటల మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

వరి సాగు చేస్తున్న నేపథ్యంలో పంటల మార్పిడి విధానంలో పెసర, మినుము వంటి పప్పు ధాన్యాలు వేసుకోవాలని రైతులకు తెలిపారు. రైతులు రసాయనిక ఎరువులు కాకుండా జీవామృతలు, చెట్ల కషాయలతో తయారు చేసిన మందులు వాడటం మంచిదన్నారు, పొల్లాలో పశువుల ఎరువులు వేసుకుంటే మంచి దిగుబడితో లాభాలు వస్తాయని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో, వ్యవసాయ విస్తరణ అధికారిణి మౌనిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply