వేసవి సందర్భంగా ప్రజలకు ఫ్రూట్ సలాడ్ మజ్జిగ పంపిణీ
పాయకాపురం, ఆంధ్రప్రభ ; వేసవి సందర్భంగా ప్రజలకు ఫ్రూట్ సలాడ్ మజ్జిగ పంపిణీ కార్యక్రమం సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో సింగినగర్ పైపుల రోడ్ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు 1000 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరావు లాంచనంగా ప్రారంభించి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న 58 డివిజన్ను శాఖను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాసేవ కార్యక్రమాలు తమ డివిజన్ 11 సంవత్సరాల నుండి నిర్విరామంగా చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.కార్యదర్శి వర్గ సభ్యుడు కేవీ భాస్కరరావు,నగర సమైక్య కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ స్థానిక కార్యదర్శులు ఎస్కే భాష ,కంది ఆదినారాయణ, సిహెచ్ గురవయ్య ,టి బ్రహ్మాజీ, పి నాగరాజు, నాగేశ్వరరావు వినయ్ ,కెవి నిర్మల, గృహలక్ష్మి , చిన్నారులు యశ్విన్, యశ్వికా, కన్నమ్మ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
