UPI Fraud Alert I ఒక్క క్లిక్ తో ఖాతా ఖాళీ.. యూపీఐ వాడేవారు జాగ్రత్త..
UPI Fraud Alert I ఒక్క క్లిక్ తో ఖాతా ఖాళీ.. యూపీఐ వాడేవారు జాగ్రత్త..
UPI Fraud Alert I “డబ్బు వస్తుంది” అని పిన్ అడిగితే నమ్మొద్దు.. ఎందుకంటే?
UPI Fraud Alert I ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇప్పటు టీ షాప్ నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లలో బిల్ చేయాలంటే మనం యూపీఐ వాడుతున్నాం. చిన్న అవసరాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు పంపాలన్నా.. మనం ఫోన్ తో డబ్బులు పంపుతున్నాం. దీంతో ఇప్పుడు దేశంలో యూపీఐ వినియోగదారులు పెరిగిపోయారు. 2026 మే నెలలో దాదాపుగా రూ. 29.9 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయంటే.. అర్థం చేసుకోవచ్చు.. దేశం యూపీఐ వాడకం ఎలా ఉందో తెలుస్తోంది.
UPI Fraud Alert I అయితే యూపీఐ వాడకం ఎంతలా పెరిగిందో అంతే వేగంగా మోసాలు కూడా కొత్త రూపాల్లో పెరుగుతునే ఉన్నాయి. బ్యాంక్ అధికారులమని చెబుతూ.. బహుమతి గెలిచారని నమ్మించి.. తప్పుగా డబ్బు పంపామని చెప్పి తిరిగి పంపించమని.. నకిలీ లింకులు పంపించడంతో ఇలాంటి భారీ మోసాలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా “డబ్బు రావాలంటే పిన్ పెట్టండి” అనే మాటను నమ్మి చాలామంది మోసపోతున్నారు.
UPI Fraud Alert I పిన్ చెప్పకండీ..
యూపీఐ పెమెంట్ చేసెప్పుడు మనం గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం డబ్బు తీసుకోవడానికి ఎప్పుడూ యూపీఐ పిన్ అవసరం లేదు. పిన్ అనేది డబ్బు పంపేటప్పుడు మాత్రమే అవసరం. ఎవరైనా “మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.. పిన్ పెట్టండి” అంటే అది మోసం అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఎన్పీసీఐ ప్రకారం.. యూపీఐ పిన్ను ఎవరికీ చెప్పకూడదు. లావాదేవీకి అనుమతి ఇవ్వడానికి మాత్రమే పిన్ ఉపయోగించాలి.

UPI Fraud Alert I పెరుగుతున్న మోసాలు..
మోసగాళ్లు ఎక్కువగా భయాన్ని లేదా ఆశను ఆయుధంగా వాడుకొని “మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది”, “కేవైసీ పూర్తి చేయండి”, “లక్కీ డ్రాలో గెలిచారు”, “రిఫండ్ వస్తుంది”, “తప్పుగా మీకు డబ్బు పంపాం” అంటూ ఫోన్ చేసి లేదా మెసేజ్ పంపి యూజర్లను మోసగిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో తొందరపడి లింకులు క్లిక్ చేయడం, యాప్‌లు డౌన్లోడ్ చేయడం, పిన్ లేదా ఓటీపీ చెప్పడం చాలా ప్రమాదకరం.

UPI Fraud Alert I ఇలా చేయండి…
ప్రజలు కూడా కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద నష్టాన్ని తప్పించుకోవచ్చు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన లింకులు అస్సలు క్లిక్ చేయకూడదు. యూపీఐ పిన్, ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకూడదు. డబ్బు పంపే ముందు పేరు, నంబర్, మొత్తం కచ్చితంగా చెక్ చేయాలి. అనుమానం ఉంటే బ్యాంక్ అధికారిక నంబర్‌కే కాల్ చేయాలి. మోసం జరిగితే వెంటనే బ్యాంక్‌కు తెలియజేయడంతో పాటు 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి.

click here to read more: Hidden Treasure | సొంత ఇంటిలో మహిళ అనుమానాస్పద పూజలు
