బాధిత కుటుంబానికి ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ అండ

రాయపర్తి, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ బాధిత కుటుంబానికి అండగా నిలిచింది.
మండలంలోని తిర్మలయాపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు వశపాక కొమురమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబానికి 50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్ అందజేసి ఆర్థికంగా ఆదుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, స్థానిక సర్పంచ్ బరిగేల బాబు, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు వశపాక కుమారస్వామి, వశపాక మారయ్య, చిన్న యాకయ్య, యూత్ నాయకులు దోమల నవీన్, వశపాక విజయ్, బంధువులు తదితరులు పాల్గొన్నారు.
