డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి..

  • డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు విద్యా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ స్కూల్ విద్యార్థులతో గురువారం యాదగిరిగుట్టలో 2కే రన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, చదువుతో పాటు మంచి విలువలను అలవర్చుకోవాలని అన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి, వారు చెడు మార్గంలో వెళ్లకుండా పర్యవేక్షించాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ బి. భాస్కర్, ఎస్సైలు యాదయ్య, సైదులు, రూపశ్రీ, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.