సర్ ప్రక్రియపై ఎన్డీయే కార్యాలయంలో అవగాహన సదస్సు
భవానిపురం, ఆంధ్రప్రభ : ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ “సర్” ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఎన్డీయే కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) కూటమి నేతలు ఈగల సాంబశివరావు, టీడీపీ మహిళా నాయకురాలు బంకా నాగమణి పాల్గొని మాట్లాడారు.
“సర్” ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం కూటమి నేతలపై ఉందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యలా సుజన మిత్రా కోఆర్డినేటర్లు, కూటమి నేతలు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు..
