కన్నతండ్రి కాలయముడయ్యాడు..

కన్నతండ్రి కాలయముడయ్యాడు..

  • రెండేళ్ల కూతుర్ని కడ తేర్చిన కన్న తండ్రి
  • భార్యాభర్తల తగువుకు కూతురు బలి
  • కూతురు మృతి తండ్రి పరిస్థితి విషమం

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : భార్యాభర్తల కుటుంబ కలహాలకు ఘోర విషాదానికి ఒడిగట్టాడు భర్త.. కన్న తండ్రి రెండు ఏళ్ల కూతురీనీ కడతేర్చిన హృదయ విచారక ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో చోటుచేసుకుంది.. నారాయణపురం మండలంలోని లచ్చమ్మ గూడానికి చెందిన వరికుప్పల రవికి రంగారెడి జిల్లా మాల్ కు చెందిన స్వాతితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమార్తెలు…

సాఫీగా సాగుతున్న జీవితంలో గత ఆరు నెలలుగా భార్య భర్తల మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో గత 3 నెలల క్రితం భర్తతో తగువు పెట్టుకుని తల్లిగారింటికి 9 నెలల చిన్న కూతురు మయూరితో వెళ్ళిపోయింది.. పెద్దకూతురు మేఘన భర్త రవి దగ్గర ఉంటుంది.భర్త రవితో విసుగెత్తిన స్వాతి మాల్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడంతో మనస్థాపానికి గురైన రవి పెద్ద కూతురు మేఘనకు ఎలుకల మందు కలిపి తాను తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేఘన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.రవి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇట్టి సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జగన్ తెలిపారు.

Leave a Reply