వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పట్టుకున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు.ఇవ్వాళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సీఐ బ్యాన్సిలాల్ దొంగ వివరాలను వెల్లడించారు.కిష్టంపేట గ్రామానికి చెందిన కల్యాణం రమేష్ అనే దొంగను పట్టుకుని విచారించగా కిష్టంపేట గ్రామంలో 4 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నరు.నిందితుని వద్ద నుండి సుమారు ఒక లక్ష ముఫై ఎనిమిది వేల రూపాయల విలువగల వస్తువులను రికవరీ చేసినట్లు తెలిపారు.నిందితుని పైన పట్టణ పోలీస్ స్టేషన్ లో నాలుగు కేసులు ఉన్నట్లు,నిందితుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.దొంగను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై శ్యాం పటేల్ ను సిబ్బందిని ఈ సందర్బంగాసీఐ బన్సిలాల్ అభినందించారు.

Leave a Reply