Packets | రూ.3 కోట్ల హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం

Packets | రూ.3 కోట్ల హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం

Packets | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి 8.705 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రయాణికుల లగేజీలో అనుమానాస్పదంగా ఉన్న 24 ప్యాకెట్లను అధికారులు తనిఖీ చేయగా.. వాటిలో హైడ్రోఫోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఆలూ చిప్స్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, ఇతర డబ్బాల్లో దాచిపెట్టి తరలించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3.05 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.