న్యాయం చేయాలని రైతుల ఆందోళన

న్యాయం చేయాలని రైతుల ఆందోళన

పెద్దపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): పెద్దపల్లి నుంచి అప్పన్నపేట వరకు నిర్మించనున్న బైపాస్ రోడ్డు కారణంగా తమ భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, తమకు న్యాయం చేయాలని అప్పన్నపేట గ్రామ రైతులు డిమాండ్ చేశారు.

బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకముందే హద్దురాళ్లు పాతే పనులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.