Movie | ‘సత్యవాన్ సావిత్రి’ విడుదల తేదీ ఖరారు!
Movie | ‘సత్యవాన్ సావిత్రి’ విడుదల తేదీ ఖరారు!
Movie | జూలై 24న విడుదల
లాయర్ పాత్రలో కీర్తి సురేశ్..
జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి
కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రంలో కీలక పాత్రలో మిస్కిన్
Movie | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా కోర్ట్‌రూమ్ డ్రామా ‘సత్యవాన్ సావిత్రి’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ ఓ న్యాయవాది పాత్రలో కనిపించనుంది. కోర్టులో జరిగే ఉత్కంఠభరిత వాదోపవాదాల నేపథ్యంలో కథ సాగనున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు, నటుడు మిస్కిన్ కూడా మరో కీలక లాయర్ పాత్రలో నటిస్తుండటం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.
నూతన దర్శకుడు ప్రవీణ్ ఎస్. విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథలో భావోద్వేగాలు, న్యాయపోరాటం, సామాజిక అంశాలను మేళవించి రూపొందించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్ స్వరాలు అందిస్తుండగా, వేదికరన్‌పట్టి ఎస్. శక్తివేల్, ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కీర్తి సురేశ్, ఈసారి కోర్ట్‌రూమ్ డ్రామాతో ఎలాంటి మాయ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
