జమ్మికుంటలో దారుణం

జమ్మికుంటలో దారుణం
జమ్మికుంట, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయుడు కొట్టాడనే భయంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జమ్మికుంట పట్టణంలో ఈ రోజు చోటుచేసుకుంది. పట్టణంలోని ఎస్వీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న చరణ్‌కుమార్, రామ్ చరణ్‌లు(Charan Kumar and Ram Charan) ఉపాధ్యాయుడు కొట్టాడని భయంతో సోమవారం రాత్రి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
గమనించిన స్కూల్ యాజమాన్యం విద్యార్థులను గమనించి వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి(private hospital) తరలించగా చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు విద్యార్థులకు న్యాయం చేయాలని స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు.
