జిల్లా విద్యాధికారిని కలిసిన సదాశివపేట మండల విద్యాధికారి

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: సదాశివపేట మండలంలోని పలు విద్యా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల విద్యాధికారి శంకర్ గురువారం సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని విద్యా సంబంధిత అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం సదాశివపేట మండలంలోని నిజాంపూర్-కె ప్రాథమిక పాఠశాల గోడపత్రికను జిల్లా విద్యాధికారి రోహిణి ఆవిష్కరించారు.

పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణను ఆమె అభినందించారు. అనంతరం జిల్లా విద్యాధికారిని మండల విద్యాధికారి శంకర్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి లింబాజీ, సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్, ఉపాధ్యాయుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.