రక్తపోటును నియంత్రించవచ్చు

రక్తపోటును నియంత్రించవచ్చు
“సైలెంట్ కిల్లర్” హైపర్‌టెన్షన్‌పై అప్రమత్తం కావాలి
క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవాలని మెడికవర్ వైద్యుల సూచన
గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 17న నిర్వహించే వరల్డ్ హైపర్‌టెన్షన్ డే సందర్భంగా అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)పై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు సూచించారు.
ఈ ఏడాది “Controlling Hypertension Together: Check Your Blood Pressure Regularly, Defeat the Silent Killer” అనే థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ద్వారా “సైలెంట్ కిల్లర్”గా పిలిచే ఈ వ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
లక్షణాలు లేకుండానే ప్రాణాలకు ముప్పు
ఈ సందర్భంగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. ఎన్. చైతన్య కుమార్ మాట్లాడుతూ, హైపర్‌టెన్షన్ చాలా సందర్భాల్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. అందుకే దీనిని “సైలెంట్ కిల్లర్”గా పిలుస్తారని వివరించారు. అనియంత్రిత రక్తపోటు వల్ల గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులు వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
జీవనశైలే ప్రధాన కారణం
అధిక ఉప్పు వినియోగం, మానసిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, పొగతాగడం, మద్యపానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు హైపర్‌టెన్షన్‌కు ప్రధాన కారణాలని వైద్యులు తెలిపారు. ప్రస్తుత కాలంలో యువతలో కూడా రక్తపోటు సమస్యలు పెరుగుతున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
నియంత్రణలో ఉంచితే ప్రమాదాలకు చెక్
క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, వైద్యుల సూచనల మేరకు మందులు వాడడం ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచవచ్చని వైద్యులు సూచించారు.
హైపర్‌టెన్షన్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే అనేక ప్రాణాంతక సమస్యలను నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
“ప్రజల ఆరోగ్య రక్షణకు కట్టుబడి ఉన్నాం”
మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, హైపర్‌టెన్షన్‌పై ప్రజల్లో అవగాహన పెంపు అత్యంత అవసరమన్నారు. క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక ప్రమాదకర సమస్యలను ముందుగానే నివారించవచ్చని తెలిపారు. ప్రజలకు అత్యుత్తమ గుండె సంబంధిత వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్య రక్షణకు మెడికవర్ హాస్పిటల్స్ కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
