సెస్ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రులు
సిరిసిల్ల, ఆంధ్రప్రభ: సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కుటుంబాన్ని మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు పరామర్శించారు. రామారావు కుమారుడు చిక్కాల అశ్విన్ ఇటీవల మృతిచెందగా, గురువారం సిరిసిల్లలో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అశ్విన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేటీఆర్, హరీశ్‌రావు ఆయన అకాల మరణంపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం రామారావు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, గూడూరు ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
