రాజీ మార్గమే రాజమార్గం..
- ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్
- ధర్మపురి కోర్టు న్యాయమూర్తి యేగి జానకి
ధర్మపురి (ఆంధ్రప్రభ): రాజీపడదగిన కేసులను పరిష్కరించడానికి రాజీ మార్గమే రాజమార్గం అని ధర్మపురి కోర్టు న్యాయమూర్తి శ్రీమతి యాగి జానకి పేర్కొన్నారు. సోమవారం కోర్టులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ శనివారం నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో సీఐ నర్సింహారెడ్డి, ధర్మపురి, వెల్గటూర్, బుగ్గారం ఎస్ఐలు ఉదయ్‌కుమార్, ఉమాసాగర్, సతీష్, రవీందర్ తదితర పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
