కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోల గంగన్న ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గా పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, కడం సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, పెద్దూర్ కడం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కడెం పట్టణ అధ్యక్షులు వాజీద్, ఉపసర్పంచ్‌ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు పి సంపత్ రెడ్డి, జిల్లాకార్యదర్శి గొర్రె మధుకర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కోల శ్రీను, లచ్చన్నతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలువురు ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.