ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యంపై బీజేపీ ధర్నా
హనుమకొండ బ్యూరో, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్ ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఫాతిమానగర్ వద్ద ధర్నా నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు గ్రామ పద్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనతో హనుమకొండ–హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు లవకుశ మాట్లాడుతూ, సంవత్సరాలు గడుస్తున్నా కాజీపేట ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.
