రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి..

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి..

  • మృతుల కుటుంబానికి అండగా ఉంటాం : చాగండ్ల నరేంద్రనాథ్

గజ్వేల్, ఆంధ్రప్రభ : గజ్వేల్ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన అత్తెల్లి ప్రవీణ్, జ్యోతి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగండ్ల నరేంద్రనాథ్ అన్నారు.

మంగళవారం శేరిపల్లి గ్రామంలో ప్రవీణ్, జ్యోతి దంపతుల మృతదేహాలకు నరేంద్రనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను, పిల్లలను పరామర్శించి, వారి కూతురు వివాహం కోసం రూ.5 లక్షల చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు వెన్నంటే ఉండే ప్రవీణ్ దంపతులు మృతి చెందడం తీరని లోటని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

నరేంద్రనాథ్ వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి, నాయకులు తలకొక్కుల దుర్గాప్రసాద్, మాజీ కౌన్సిలర్ కంటూ సుభాష్ చంద్రబోస్, మాల మహానాడు నాయకులు తుమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply