Breaking news | పోలీసుల అదుపులో ఉదయనిధి స్టాలిన్‌…

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నటి త్రిషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు తంజావూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.