ఉదయం పూటనే ఉపాధి హామీ పనులు

ఉదయం పూటనే ఉపాధి హామీ పనులు

జైనూర్, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పనులను కూలీలు ఉదయం పూటనే చేయాలని కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పవర్ గూడ గ్రామపంచాయతీ సర్పంచ్ తొడసం రాజేందర్ అన్నారు. ఆయన సోమవారం పవర్ గూడ పంచాయతీ పరిధిలో ఉపాధి కూలీలు చేస్తున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఉపాధి హామీ కూలీలతో ఉదయం పూటనేపనులుచేయించాలని వారికి సౌకర్యాలు కల్పించాలని సర్పంచ్ కోరారు. కూలీలకు మంచినీటి వసతితో పాటు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలని ఆయన అధికారుల కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉత్తమ్, పంచాయతీ కారోబారి ఉయిక జ్ఞానేశ్వర్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply