అందరూ సమానులే..ఘనంగా బసవ జయంతి..

అందరూ సమానులే..ఘనంగా బసవ జయంతి..
జగదేవపూర్, ఆంధ్రప్రభ : జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో సోమవారం 893వ బసవ జయంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ 900 సంవత్సరాల క్రితమే మనుషులంతా సమానమే, లింగభేదం లేదంటూ బోధించడం జరిగింది.
నాటి ఆయన బోధనలే నేటికీ ఆచరణీయమైనవి. నేటి యువతకు ఆచరణీయమైన ఆయన బోధనలు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి లింగప్ప, నరేష్, శరణప్ప, శంకరప్ప, ప్రవీణ్, నాగరాజు, సంతోష్, విజయ్ కుమార్, రంగప్ప, తదితరులు పాల్గొన్నారు.
