Chennur | రోడ్డువెడల్పును కుదించండి..

Chennur | రోడ్డువెడల్పును కుదించండి..
- మంత్రికి వ్యాపారాస్తుల విన్నపం
Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాల్టీ పరిధిలోని మెయిన్ రోడ్డులో ప్రభుత్వం చేపడుతున్న రోడ్డువెడల్పులో కాస్త కుదింపు చేసి తమ జీవనదారమైన విలువైన స్థలాలకు నష్టం చేయకుండా చూడాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. గత కొద్దిరోజులు క్రితం చెన్నూరు పట్టణం అంబేద్కర్ చౌక్ కోటపెల్లి బస్టాప్(పెద్ద చెరువు) వరకు నిత్యం ట్రాఫిక్ ఇబ్బంద్ది ఏర్పడుతున్న దృష్ట్యా మున్సిపల్ అధికారులు 66ఫీట్ల రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టి కొలతలు ప్రారంభించారు.
దీంతో వ్యాపారాస్తుల్లో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మంత్రి వివేక్ కు తమగోడును పలుమార్లు వినిపించారు. ఇవాళ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పలువురు వ్యాపారస్తులు మాట్లాడుతూ… సుమారు రెండు వందల కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డుకు ఇరుపక్కల వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని, రహదారి విస్తరణ కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడనున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఎప్పుడూ పట్టణ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, వ్యాపారస్తులు ఆర్థికంగా నష్టపోకుండా అధికారులు ప్రతిపాదించిన 66ఫిట్ల రోడ్డు విస్తరణ పరిధిని 44ఫీట్లకు కుదించాలని కోరారు.
