జైనూర్ లో భక్తిశ్రద్ధలతో వటసావిత్రి వ్రత పూజలు..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిర్ ఆవరణలో సోమవారం ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని మర్రి చెట్టు కింద హనుమాన్ మందిర్ పూజారి కులకర్ణి పండిత్ మహారాజ్ వట సావిత్రి వ్రత పూజలతో మహిళలు వటసావిత్రి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజారి కులకర్ణి పండిత్ మహారాజ్ ఆధ్వర్యంలోవట సావిత్రి వ్రతాన్ని చదువుతూ మహిళలతో వ్రత పూజలు చేయించారు, మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మర్రిచెట్టుకుసాంప్రదాయబద్ధంగా దారాన్ని చుట్టి మంగళహారతులతో మర్రి చెట్టుకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు.
