19వ వార్డులో క్షుద్రపూజల కలకలం..

19వ వార్డులో క్షుద్రపూజల కలకలం..

  • భయాందోళనలో బస్తీ ప్రజలు

బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని 19వ వార్డులోని బెల్లంపల్లి బస్తీలో క్షుద్ర పూజలు చేసిన గుర్తులు కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బస్తీలోని ఒక ప్రాంతంలో ఎర్రటి కుంకుమతో పెద్ద పెద్ద ముగ్గులు వేసి, వాటి మధ్యలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు చల్లి, దీపాలు వెలిగించి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఈ వింత ఆకృతులను చూసిన వార్డు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత కొంతకాలంగా బస్తీ పరిసరాల్లో ఇలాంటి వింత పూజల ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ఇటువంటి క్షుద్ర పూజలకు పాల్పడుతున్న వ్యూహకర్తలను పోలీస్ అధికారులు వెంటనే గుర్తించాలని, వారిపై తగు చర్యలు తీసుకుని బస్తీ ప్రజల భయాలను పోగొట్టాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply