విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు

విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు

  • ఓరుగల్లులో చంద్రబాబు బర్త్ డే వేడుకలు

వరంగల్, ఆంధ్రప్రభ : అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉన్న మహానేత చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ వరంగల్ ఇంచార్జి, అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం జాతీయాధ్యక్షులు జి ఎల్ శ్రీధర్ కొనియాడారు.అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు 76వ జన్మదినోత్వవ వేడుకలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోఘనంగా నిర్వహించారు. వరంగల్ జేపీఎన్ రొడ్డిలోని లక్ష్మీ టాకీస్ దగ్గర కేక్ ను కట్ చేసి స్వీట్లను పంచి పెట్టారు.

ఈ సందర్భంగా జి ఎల్ శ్రీధర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కీర్తిని పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికతో చిత్తశుద్ధితో, నిజాయితితో కృషి చేస్తున్నాడన్నారు. చంద్రబాబు నాయుడు వేసిన ప్రగతిపథం తోనే హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని జి ఎల్ శ్రీధర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాగవెల్లి సురేష్, నల్లకుంట రవికుమార్, చాగంటి ప్రకాష్, విజేందర్ గౌడ్, మామిడాల రాములు, కందుకూరు రవీందర్, సుంకరి సాంబమూర్తి, ఎం పరశు రాములు, మిద్దపాక రవీందర్, కాగితాల రాములు, కొక్కొండ హరి, రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply