సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ…

భవానిపురం, ఆంధ్రప్రభ ; పశ్చిమ నియోజకవర్గం లో వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఆర్థిక సహాయం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు మంజూరు అయ్యాయి. మొత్తం 30 మంది లబ్ధిదారులకు 19,09,076/- రూపాయల విలువైన చెక్కులను భవానీ పురం లోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 44 డివిజన్ బిజెపి ఇన్చార్జ్ రెడ్డిపల్లి రాజు , 42వ డివిజన్ బిజెపి అధ్యక్షులు సోమేశ్వరరావు, 48వ డివిజన్ బిజెపి అధ్యక్షులుదేవిక హరి ప్రసాద్, 34వ డివిజన్ బిజెపి అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్, ఊర్మిళా నగర్ మండల అధ్యక్షుడు బిజెపి పగడాల కృష్ణ, టిడిపి 54వ డివిజన్ అధ్యక్షులు అజీజ్, 43వ డివిజన్ జనసేన అధ్యక్షులు కోటేశ్వరరావు, 48వ డివిజన్ టిడిపి అధ్యక్షులు దేవర జోగేశ్వరరావు,
బీజేవైఎం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతిర్మయి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply