సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం

భవానిపురం, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని 40వ డివిజన్ టీడీపీ, బీజేపీ అధ్యక్షులు పీవీ చిన సుబ్బయ్య, నక్కిట్ల రాజా అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వివిధ సమస్యలపై వినతులు సమర్పించారు.

వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకతీతంగా , ప్రజాసేవే ధ్యేయంగా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీవీ చిన సుబ్బయ్య, బీజేపీ అధ్యక్షుడు నక్కిట్ల రాజా అన్నారు.మాజీ కార్పొరేటర్ పైడిమాల సుభాషిణి,కూటమి నేతలు కామ దేవరాజ్, కొప్పుల గంగాధర్, పోతిన భేసు కంఠేశ్వరుడు బొల్లేపల్లి కోటేశ్వరరావు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, పట్నాల హరిబాబు తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.