Dhurandhar 2 | సరికొత్త రికార్డ్..

Dhurandhar 2 | సరికొత్త రికార్డ్..

Dhurandhar 2 | ధురంధర్ సిరీస్ కలెక్షన్లు 3,019 కోట్లు
చరిత్ర సృష్టించిన ధురంధర్ 2 విజయం
బాహుబలి, పుష్ప రికార్డులు బ్రేక్ చేసిన ధురంధర్
హిందీ సినిమాలకు కొత్త బెంచ్‌మార్క్
రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో మైలురాయి

Dhurandhar 2 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ధురంధర్ 2.. అంచనాలకు మించిన సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఇప్పటి వరుకు ఉన్న రికార్డులను ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కనీవినీ ఎరుగని విధంగా సంచలనాలు సృష్టిస్తుంది. తాజాగా రెండు క్రేజీ సినిమాలు సెట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసి న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకీ.. ధురంధర్ 2.. ఏ రెండు సినిమాల రికార్డును బ్రేక్ చేసింది..? సరికొత్తగా సెట్ చేసిన రికార్డ్ ఏంటి..?

ధురంధర్ సీరిస్ కలెక్షన్ 3,019 కోట్లు..

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా సీక్వెల్స్ సాధించని అరుదైన రికార్డును ధురంధర్ 1, ధురంధర్ 2 అందుకోవడం విశేషంగా నిలిచింది. ధురంధర్, ధురంధర్ 2 చిత్రాలు కలిపి అక్షరాలా 3,019 కోట్ల భారీ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. మొదటి భాగమైన ధురంధర్ చిత్రం 1,307 కోట్లకు పైగా వసూలు చేసి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా కేవలం హిందీలోనే విడుదలై ఈ స్థాయి కలెక్షన్లు సాధించడం విశేషం. సాధారణంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమాలు మాత్రమే భారీ వసూళ్లు సాధించే ఈ కాలంలో ఒక్క భాషలోనే ఇంతటి విజయాన్ని అందుకోవడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Dhurandhar 2

చరిత్ర సృష్టించిన ధురంధర్ 2..

ఇక రెండో భాగం ధురంధర్ 2 మరింత భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుని 1,712 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మొదటి భాగం సృష్టించిన అంచనాలను మించి, ఈ సీక్వెల్ మరింత పెద్ద విజయం సాధించడం ఫ్రాంచైజీ స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లింది. ఈ రెండు భాగాలు కలిపి 3,019 కోట్ల వసూళ్లు సాధించడం ద్వారా భారతీయ సినిమా చరిత్రలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ సందర్భంలో ఇతర భారీ ఫ్రాంచైజీలతో పోల్చితే ధురంధర్ సాధించిన విజయ స్థాయి ఎంత గొప్పదో స్పష్టమవుతుంది.

Dhurandhar 2

కొత్త బెంచ్ మార్క్..

ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ మొదటి భాగం 650 కోట్లు, రెండో భాగం 1,788 కోట్లు వసూలు చేసి మొత్తం 2,438 కోట్లను సాధించింది. అదే విధంగా అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం 350 కోట్లు, పుష్ప-2 1,742 కోట్లను రాబట్టి మొత్తం 2,092 కోట్ల వద్ద నిలిచింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే, ధురంధర్ ఫ్రాంచైజీ ఈ రెండు భారీ సిరీస్‌లను కూడా దాటేసి టాప్ స్థానంలో నిలిచింది. ఇది కేవలం కలెక్షన్ల పరంగా మాత్రమే కాకుండా, హిందీ చిత్రాలకు గ్లోబల్ మార్కెట్ ఎంత విస్తరించిందో కూడా చూపిస్తోంది. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. అతని నటన, ఆదిత్యధర్ దర్శకత్వం, భారీ నిర్మాణ విలువలు అన్ని కలిసి ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో విజయవంతం చేశాయి. మొత్తానికి, ధురంధర్ సిరీస్ భారతీయ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందని చెప్పాలి.

Dhurandhar 2

Leave a Reply