Sridhar Babu | క్రిస్మస్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
Sridhar Babu | క్రిస్మస్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
Sridhar Babu | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండలంలోని తిమ్మరాయినిపహాడ్ గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu), నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లు హాజరయ్యారు. మంత్రి చిరకాల మిత్రుడు సింగపూర్ లో స్థిరపడిన గ్రామానికి చెందిన పూదోట సుధీర్ ఆహ్వానం మేరకు మంత్రి, ఎమ్మెల్యేతో కలిసి హాజరై క్రిస్మస్ వేడుకల్లో (Christmas celebrations) పాల్గొని విందు ఆరగించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్దన రమేష్, నాయకులు మొగిలి వెంకట్ రెడ్డి, మంద యాకయ్యగౌడ్, తప్పేట రమేష్, బండి హరీష్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.
