ప్రత్యామ్నాయ పంటల సాగు..రైతులకు అధిక లాభాలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక దిగుబడి తో పాటు అధిక లాభాలు పొందవచ్చునని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. మంగళవారం మండలంలోని జూకల్ ఓ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి రైతు సదస్సు ,ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీల్ కుమార్, అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ పాల్గొని మాట్లాడారు. రైతులు పండించే వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, పంట తోపాటు ఉద్యాన పంటల సాగు – ఆయిల్ పామ్ సాగు, విస్తీర్ణం – ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక లాభాలు సాధించవచ్చునని అన్నారు.

సబ్సిడీపై డ్రిప్పులు స్పిన్గ్లర్లు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా త్వరితగతిన కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా,ఉద్యాన పంటల సాగు – ఆయిల్ పామ్ సాగు, విస్తీర్ణం పెంపుదల – ప్రత్యామ్నాయ పంటల సాగు పై సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలోజిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాడి బాబూరావు, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి వాల్య నాయక్, భూపాల్ పల్లి ఏడిఏ రమేష్, చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, తహసిల్దార్ వసంతరావు, ఎంపీడీవో జయశ్రీ, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, గుంటూరుపల్లి సర్పంచి, గుంటుపల్లి నాగమల్లేశ్వర్ రావు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుట్ల తిరుపతి, ప్రజాప్రతినిధులు రైతులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply