Double-Murder : జంట హత్య కలకలం Andhra Prabha Crime News

Double-Murder : జంట హత్యల మర్డర్​ ప్లాన్​ !? Andhra Prabha Crime News

Double-Murder : జంట హత్యల మర్డర్​ ప్లాన్​ !? Andhra Prabha Crime News

  • ఆధారం లభ్యం
  • హతుడి కాల్​ డేటా కీలకం
  • మామ అల్లుడి హతం కలకలం
  • కృత్తివెన్నులో సంచలనం

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్​ )

Double-Murder : కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో అమానుష ఘటన సంచలనం రేపింది. చేపల వేటకి వెళ్లిన మాల్రుమ అల్లుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. కొత్త కాలవ మొగ లో మృత దేహాలు లభ్యం. బైక్ కి తాళ్లతో మృతదేహాలు కాలువలోకి విసిరివేత. స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరిన పోలీసులు. మృతదేహాలను వెలికి తీసి పూర్తి విచారు. శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పగా మృతులు గుర్తింపు. ఇద్దరు మామ అల్లుళ్లుగా స్థానికులు గుర్తించగా… ఘటన స్థలిలో లభించిన ఆధారాలతో హత్యగా పోలీసులు నిర్ధారించారు.

Double-Murder : అసలు ఏమి జరిగిందంటే

చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన శెట్టి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు, ఏడుకొండలు తండ్రి శెట్టి సుబ్బన్న(51) , అల్లుడు అయ్యప్ప కుటుంబ సభ్యులతో చేపల వేటకు వెళ్తారు. ప్రతిరోజు రాత్రి వేటకు వెళ్ళి చేపలు పట్టుకుని ఉదయం మొగల్తూరు ముత్యాలపల్లి మార్కెట్లలో అమ్ముతుంటారు, ఈ నెల .27 న సాయంత్రం 06 గంటలకు ఏడుకొండలు తన భార్య మౌనికతో కలిసి నరసాపురం అత్తారింటికి వెళ్ళిడు. రాత్రి 08 గంటలకు తండ్రి సుబ్బన్న కు ఫోన్ చేయాగ పిల్లలు పడుకున్నారు. బావ గొలుసు అయ్యప్ప కలిసి చేపల వేటగా వెళుతున్నట్టు సమాధానం ఇచ్చాడు. 28వ తేదీ తెల్లవారుజామున ఏడుకొండలు ఇంటికి వచ్చాడు. కాలువలో తాను కట్టిన వల వద్దకు వెళ్లాడు. ఆ తరువాత ఇంటికి వెళ్లగా.. తన బావ, తండ్రి ఇంటికి రాలేదని చెల్లి సేట్టి నాగమ్మ ఆందోళన వ్యక్తం చేసింది. బావ మరిది, తండ్రి జాడ కోసం ఏడుకొండలు వెతికాడు. అంతర్వేది మార్కెట్టులోనూ ఆరా తీశాడు. ఈ రోజున బావమరిది, తండ్రి శవాలు కాలువలో లభించాయి.

Double-Murder : కీలకాధారం లభ్యం

తొలుత ఈ కేసును అనుమానస్పద మృతి గా పోలీసులు నమోదు చేశారు. కానీ మృతదేహాలను బైకుకు కట్టి కాలువలోకి జారిన వైనంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైగా మృతదేహాలపై గాయాలు కనిపించటంతో హత్యగా అధికారులు దృవీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఇక ఈ కేసులో అధికారులకు కీలక ఆధారం లభించింది. హతుడు సుబన్న
సెల్​ ఫోన్​ దొరికింది సుబ్బన్న కాల్​ డేటాతో.. మరింత సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఈ హత్యోదంతంలొ కుటుంబ సమస్యలు ఉన్నాయా? అనే కోణంలోనూ.. అదే విధంగా ఇతరత్రా కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.