కల్తీ విత్తనాలను అరికట్టాలి : ఆర్డీవోకు వినతి
నర్సంపేట, ఆంధ్రప్రభ : ప్రతి ఏడాది రైతులను నిండా ముంచుతున్న బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్న కల్తీ విత్తనాలను అరికట్టి, విత్తనాల అమ్ముతున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని నర్సంపేట ఆర్డీవో ఉమారాణి కి తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు కూలీ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఈర్ల పైడిమాట్లాడు తూ ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబోతున్నదనీ రైతులు తమ పంట భూములను సదును చేసి విత్తనాలను విత్తుటకు సిద్ధంగా ఉన్నారు.
ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ప్రతి సంవత్సరం విత్తన వ్యాపారులు కల్తీ చేసి రైతులను నిలువునా ముంచుతున్నారు. దానికి తోడు ఏ విత్తనములు అయితే మంచి దిగుబడిని ఇస్తుందో ఆ విత్తనాల ప్యాకెట్లను బ్లాక్ మార్కెట్కు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించి, బ్లాక్లో విత్తనాలను అమ్ముతూ రైతులను నిలువు దోపిడీ చేయడం జరుగుతున్నదనీ పైడి ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో వరంగల్ పట్టణం, నర్సంపేట కేంద్రంగా చేసుకొని ఈ దళారీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలు గా కొనసాగిస్తున్నారు.
దీనికి వ్యవసాయ అధికారులు కూడా సరైన పర్యవేక్షణ కొనసాగించడం లేదన్నారు. అధికారులు స్పందించి కల్తీ విత్తనాలు అరికట్టాలని, బ్లాక్లో అమ్మే విత్తన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంలో వెనుకడుగు వేస్తూ విత్తన కంపెనీలకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇస్తుందనీఆరోపించారు.వ విత్తన (మొక్కజొన్న ,బుల్ ప్రతి ,మిర్చి )రేట్లు తగ్గించాలని తెలంగాణ రైతు కూలీ సంఘం వరంగల్ జిల్లా కార్యవర్గం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ భూమా అశోక్, బర్ల గౌరయ్య, శివరాత్రి కుమార్,బోనగిరి సారయ్య,పిండి బాలకోమూరు, అజ్మీరా పులియా, అజ్మీరా శివరామ్, గొర్రె మొగిలి తదితరులు పాల్గొన్నారు.
