రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు…

రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు…

తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి

తొర్రూరు, ఆంధ్రప్రభ : రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని వెలికట్ట,చర్లపాలెం గ్రామాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయా గ్రామాల సర్పంచ్ లు ధర్మారపు మహేందర్,బందు శ్రీనివాస్ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం అమ్మి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని తెలిపారు.రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, రైతుల బాగు కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని,వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రూ.500 రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు.

రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం చర్లపాలెం గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, పెద్ద మంగ్య తండా, భోజ్య తండా సర్పంచ్లు జాటోత్ రాంలాల్, మాలోత్ మౌనిక సంతోష్, నాయకులు జాటోత్ రవి నాయక్, నరేందర్ రెడ్డి, నాగిరెడ్డి,యాకూబ్ రెడ్డి,దీకొండ శ్రీనివాస్, చిట్టి మల్ల మహేష్,దర్గయ్య,మల్లయ్య, ధర్మారపు శీను, యాకన్న,ప్రకాష్ సుధాకర్ రెడ్డి,యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply