పర్యావరణ పరిరక్షణకు సైకిల్ యాత్ర చేసిన ఎమ్మెల్యే..

బాపట్ల,ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తన నివాసం నుంచి వెదుళ్ళపల్లి ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల వరకు సుమారు 15 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టారు.

అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.