Narasaraopet-Railway : యమ లేటు గురూ Andhra Prabha Top Story
Narasaraopet-Railway : యమ లేటు గురూ Andhra Prabha Top Story
- నిధులు అమృతం
- పనులు ఆహా… మృతం
- ప్లాట్ఫాం–2 వద్ద కనీస సదుపాయాల కొరత
- రాత్రి వేళల్లో లైటింగ్, సూచిక బోర్డుల నిల్
- తాగునీరు, పారిశుద్ధ్యం ఊసే లేదు
- ప్రయాణికులకు ఇక్కట్లే ఇక్కట్లు
ఆంధ్రప్రభ, నరసరావుపేట:

పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేట రైల్వే స్టేషన్లో కనీస మౌలిక వసతుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ అవి నత్తనడకన సాగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్లాట్ఫాం–2 వద్ద తగిన సదుపాయాలు, సూచిక బోర్డులు, లైటింగ్ లేకపోవడంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. భద్రతా చర్యలు బలోపేతం చేసి, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర ప్రాథమిక సౌకర్యాలను వెంటనే కల్పించాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
ALSO READ : Viral-Audio-Pacs : జిప్సం జగడం Andhra Prabha Top Story
