విరిగిన విద్యుత్ స్తంభాల మరమ్మతులకు కౌన్సిలర్ చొరవ

విరిగిన విద్యుత్ స్తంభాల మరమ్మతులకు కౌన్సిలర్ చొరవ

భారీ వర్షానికి దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ

సమస్య పరిష్కారంలో కౌన్సిలర్ పాత్రను ప్రశంసించిన స్థానికులు

క్యాతన్‌పల్లి, (ఆంధ్రప్రభ): భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని 16వ వార్డు సింగరేణి షిర్కీ కాలనీలో చెట్టు విరిగి పడటంతో విద్యుత్ స్తంభం ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక కౌన్సిలర్ కృపానందం (గ్యాస్ నాని) ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సింగరేణి సంస్థ అధికారులతో సమన్వయం చేసి తక్షణ మరమ్మతు పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. సింగరేణి కంపెనీ ఆధ్వర్యంలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభం స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.

ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, భారీ వర్షం కురిసిన రాత్రి నుంచి సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు కౌన్సిలర్ తమ వెంట ఉండి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కౌన్సిలర్ చూపిన చొరవ అభినందనీయమని వారు పేర్కొన్నారు.

Leave a Reply