Tragedy | ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Tragedy | ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Tragedy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని సంగం మండలం దువ్వూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది.

మృతులను విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు, ఆయన భార్య రత్నావళి, కుమారుడు సాయి సుకృత్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ దారుణ నిర్ణయానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల ఆర్థిక, వ్యక్తిగత, ఇతర పరిస్థితులపై ఆరా తీస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply