సురక్షిత ప్రయాణమే లక్ష్యం…

సురక్షిత ప్రయాణమే లక్ష్యం…
ఆర్టీసీ డ్రైవర్ వెంకటేష్‌కు ఘన సన్మానం
కడెం, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ అల్తాటి వెంకటేష్‌ను అధికారులు ఘనంగా సన్మానించారు. కడెం మండలంలోని అంబారిపేట్ గ్రామానికి చెందిన అల్తాటి వెంకటేష్ తన విధి నిర్వహణలో ప్రదర్శిస్తున్న అంకిత భావానికి గాను ఈ గుర్తింపు లభించింది.
ప్రమాద రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆయన సేవలు అభినందనీయమని డిపో మేనేజర్ ప్రతిమ రెడ్డి, డీటీసీ శ్రీనివాస్ కొనియాడారు.
