Council | గందరగోళం
Council | గందరగోళం
Council | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) మాట్లాడుతూ… జగన్ క్రిష్టియనా…. కాదా..? అని ప్రశ్నించారు. 24గంటలు గడిచినా జగన్ ఎందుకు సమాధానం చెప్పలేదని మంత్రి అన్నారు.
సోషల్ మీడియా (Social media) లో పోస్టులు పెట్టేది వాళ్లే… చర్యలు తీసుకోవాలనేది వాళ్లేనని మంత్రి అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో మండలిలో గందరగోళ వాతావరణం నెలకొంది.
