సీఎం ఆదేశాలతో కలెక్టర్ పరామర్శ

సీఎం ఆదేశాలతో కలెక్టర్ పరామర్శ

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినికి (Former DSP Nalini) సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు (Collector Hanumanth Rao) తెలిపారు.

ఇదే నా మరణ వాంగ్మూలం అంటూ.. ఇటీవల నళిని బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు కలెక్టర్ హనుమంతరావు నళినితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. సర్వీసు ఇష్యూలు(Service issues) ఏం ఉన్నానిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్నసీఎం సందేశాన్నినళినికి కలెక్టర్ తెలియజేశారు.

అవసరం అయితే హైదరాబాద్ నిమ్స్, లేదా ఇతర కార్పొరేట్(corporate) ఆసుపత్రుల్లో ఎంత ఖర్చైనా ప్రభుత్వం తరఫున వైద్య సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని సీఎం చెప్పారని వెల్లడించారు. గతంలో ఆమె వైద్యం కోసం ఏదైనా ఖర్చులు అయి ఉంటే వాటిని సైతం సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) కింద చెల్లిస్తామని సీఎం చెప్పారని వివ‌రించారు. తన సర్వీస్(Service) నిబంధనల గురించి నళిని తమతో చెప్పారని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

Leave a Reply