iplcricket | స‌న్‌రైజ‌ర్స్‌ స్కోర్ 44/1

iplcricket | స‌న్‌రైజ‌ర్స్‌ స్కోర్ 44/1

iplcricket | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్‌లో ఈరోజు మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నితీశ్ అనారోగ్యం కార‌ణంగా దూరం అయ్యాడు. అత‌ని ప్లేస్‌లో స్మ‌ర‌ణ్‌ను తీసుకున్నారు. అలాగే కోల్‌క‌తా జట్టులో హ‌ర్ష్ దూబే ప్లేస్‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

హైద‌రాబాద్ జ‌ట్టు ఫ‌స్ట్ వికెట్ కోల్పోయింది. 44 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ డౌన్ అయ్యింది. అభిషేక్‌శ‌ర్మ ప‌ది బంతుల్లో 15 ప‌రుగులు చేసి కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఈ క్యాచ్‌ను గ్రీన్ ప‌ట్టేశాడు. మ‌రో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ రెచ్చిపోతున్నాడు. బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతున్నాడు. ఫ‌స్ట్ డౌన్‌లో ఇషాన్ కిష‌న్ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు.