బాసర క్షేత్రానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ..

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, నదీ తీరాన ఉన్న శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు.

అక్షరాభ్యాసం నిర్వహించేందుకు వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు ఆలయంలోని అక్షరాభ్యాస మండపంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అక్షరాభ్యాసాలు, దర్శనాల కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దర్శనం, అక్షరాభ్యాస కార్యక్రమాలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా, భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

Leave a Reply